Tragedy: తీవ్ర విషాదం.. భారత క్రికెటర్ కన్నుమూత

by Kema Shiva Kumar |

భారత క్రికెట్‌ (Indian Cricket)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Tragedy: తీవ్ర విషాదం.. భారత క్రికెటర్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్‌ (Indian Cricket)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముంబై (Mumbai) లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ (Padmakar Shivalkar) (84) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. వయసు మీద పడటంతో కొన్నాళ్లుగా ఆయన మంచానికే పరిమితమై తుది శ్వాస విడిచారు. అయితే, భారత్ (India) తరఫున 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 589 వికెట్లను పడగొట్టాడు. అదేవిధంగా 11 సార్లు 10 వికెట్లు తీసుకుని రికార్డు క్రియేట్ చేశాడు. 12 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు నేలకూల్చాడు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (CK Naidu Lifetime Achievement Award)ను అందుకున్నారు.

కాగా, ఇటీవలే ప్రపంచంలోనే అత్యంత వృద్ధ టెస్ట్ క్రికెటర్ రాన్ డ్రేపర్ (98) కన్నుమూశారు. గత కొన్ని రోజులగా ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, దక్షిణాఫ్రికా (South Africa)కు ప్రాతినిధ్యం వహించిన రాన్ డ్రేపర్ జట్టులో టాపార్డర్ బ్యా్ట్స్‌మెన్, వికెట్ కీపర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు. ఇంటర్‌నేషనల్ కెరీర్ (International Career) మొత్తంలో కేవలం 2 టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తం 25 పరుగులు చేశాడు. రాన్ డ్రేపర్ (Ron Draper) 19 ఏళ్ల వయసులో ప్రావిన్స్ తరపున ఆరెంజ్ ఫ్రీ స్టేట్‌ (Orange Free State)పై ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. మొత్తం కెరీర్‌లో రాన్ డ్రేపర్ (Ron Draper) 11 శతకాలు, 11 అర్ధ శతకాలతో పాటు 32 క్యాచులు అందుకున్నాడు.

Next Story