Tragedy: బ్యాడ్మింటన్ స్టార్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత

by Kema Shiva Kumar |

భారత బ్యాడ్మింటన్ స్టార్ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ (Rankireddy Satwik Sairaj) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Tragedy: బ్యాడ్మింటన్ స్టార్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌ (Rankireddy Satwik Sairaj) ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కాశీ విశ్వనాథ్ (Kasi Vishwanath) (67) హార్ట్ అటాక్‌తో తుదిశ్వాస విడిచారు. అయితే, శుక్రవారం ఢిల్లీలో సాత్విక్‌ సాయిరాజ్ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న (Major Dhyanchand Khel Ratna) పురస్కారం అందుకోనున్న నేపథ్యంలో కాశీ విశ్వనాథ్ సతీమణి రంగనాయకి (Ranganayaki)తో కలిసి గురువారం ఉదయం అమలాపురం (Amalapuram) నుంచి బయలుదేరారు. అనంతరం అయన కొద్దిసేపటికే కారులో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే విశ్వనాథ్‌ (Vishwanath) మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే, విశ్వనాథ్ పీఈటీగా రిటైర్ అయ్యారు. సతీమణి రంగనాయకి ఉపాధ్యాయురాలు కాగా, పెద్ద కుమారుడు చరణ్‌ (Charan) తేజ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కుమారుడు చరణ్‌ ఇండియాకు చేరుకున్న తరువాతే విశ్వనాథ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.

Next Story