IND W VS PAK W : భారత్, పాక్ మ్యాచ్‌లో టాస్ ఫిక్సింగ్?.. టీమిండియాకు అన్యాయం.. ప్రూఫ్ ఇదిగో(వీడియో)

by Harish |   (  Updated:2025-10-06 12:12:27  IST  )

ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.

IND W VS PAK W : భారత్, పాక్ మ్యాచ్‌లో టాస్ ఫిక్సింగ్?.. టీమిండియాకు అన్యాయం.. ప్రూఫ్ ఇదిగో(వీడియో)
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రోజు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే, టాస్ సమయంలో భారీ తప్పిదం చోటుచేసుకుంది. టీమిండియా టాస్ గెలిస్తే పాక్ గెలిచినట్టు మ్యాచ్ రిఫరీ ప్రకటించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అసలేం జరిగిందంటే.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కాయిన్‌ను గాల్లోకి ఎగరవేయగా.. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా టెయిల్స్ అని చెప్పింది. కానీ, కాయిన్ మాత్రం హెడ్ పడింది. మ్యాచ్ రిఫరీ షాండ్రే ఫ్రిట్జ్ హెడ్ పడిందని కూడా వెల్లడించింది. అంటే టాస్ భారత్ గెలిచింది.

ఇక్కడే రిఫరీ పెద్ద తప్పిదం చేసింది. రిఫరీ పాక్ కెప్టెన్‌ టాస్ గెలిచినట్టు ఆమెను బౌలింగ్ లేదా బ్యాటింగ్ ఎంచుకోవడానికి ఆహ్వానించింది. పాక్ కెప్టెన్ ఫాతిమా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. టాస్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాతిమా టెయిల్స్ అని చెప్పింది రిఫరీకి సరిగా వినిపించలేదో లేదా ఆమె పొరపడిందేమో ఏదైతేనేం టాస్‌లో మాత్రం టీమిండియాకు అన్యాయం జరిగింది. ఇది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. భారత అభిమానులు ఇది కచ్చితంగా టాస్ ఫిక్సింగే అంటూ ఫైర్ అవుతున్నారు. పాక్ కెప్టెన్ టెయిల్స్ అని చెప్పింది స్పష్టంగా వినిపిస్తుందని, అలాంటప్పుడు హెడ్ పడితే పాక్ ఎలా టాస్ గెలుస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. రిఫరీతో కలిసి పాక్ ఫిక్సింగ్ పాల్పడిందంటూ ఆరోపిస్తున్నారు. ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story