ఇండియాకు షాక్‌..రాజ్ కోట్ లో న్యూజిలాండ్ విజ‌యం

by velandi.Saikiran |   (  Updated:2026-01-14 16:13:21  IST  )

రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండవ వ‌న్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విక్టరీ కొట్టింది.

ఇండియాకు షాక్‌..రాజ్ కోట్ లో న్యూజిలాండ్ విజ‌యం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మొదటి వన్డేలో అదరగొట్టిన భారత జట్టుకు న్యూజిలాండ్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండవ వ‌న్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విక్టరీ కొట్టింది. దీంతో కేఎల్ రాహుల్ సెంచరీ వృథా అయిపోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లు ఆడి 7 వికెట్లు నష్టపోయి 284 పరుగులు చేసింది.

అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆచితూచి, ఆడింది కివీస్ జట్టు. ముఖ్యంగా న్యూజిలాండ్ డేంజర్ ఆటగాడు డారిల్ మిచెల్ ( Darly Mitchell ) అజేయ సెంచరీతో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్ లో 117 బంతుల్లోనే 131 పరుగులు సాధించి న్యూజిలాండ్ కు విక్టరీ అందించాడు డారిల్ మిచెల్. దీంతో ఈ 47.3 ఓవ‌ర్స్ లో మ్యాచ్ ఫినీష్ అయింది. దీంతో 1-1 తేడాతో సిరీస్ సమం చేసింది కివీస్ జట్టు. ఇక మూడో వన్డే ఈ రెండు జ‌ట్ల మధ్య మిగిలి ఉంది. ఇండోర్ వేదికగా గెలిచిన జట్టు టైటిల్ ఎగురేసుకు వెళ్ళనుంది.

Next Story