కాసేపట్లో మ్యాచ్.. టీమిండియా పరువు కాపాడుకుంటుందా?

by GSrikanth |   (  Updated:2022-12-10 02:54:56  IST  )

బంగ్లాదేశ్ పర్యటనలో చెత్త ప్రదర్శనతో విమర్శులు ఎదుర్కొంటున్న టీమిండియా.. ఆఖరి వన్డేకు సిద్ధమైంది.

కాసేపట్లో మ్యాచ్.. టీమిండియా పరువు కాపాడుకుంటుందా?
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ పర్యటనలో చెత్త ప్రదర్శనతో విమర్శులు ఎదుర్కొంటున్న టీమిండియా.. ఆఖరి వన్డేకు సిద్ధమైంది. వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడి సిరీస్ చేజార్చుకున్న భారత్‌.. నేడు బంగ్లాదేశ్‌తో ఆఖరి వన్డే మ్యాచ్ ఆడనుంది. నేడు ఉదయం 11 గంటలకు చట్టోగ్రామ్ వేదికగా జరుగనున్న వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని పట్టదలతో ఉంది. ఇప్పటికే గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును వీడటం పెద్ద సమస్యగా మారింది. ఈ చివరి మ్యాచ్‌‌కు టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందుబాటులోకి రానున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టెస్టు సిరీస్‌కైనా రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది.

Also Read....

2022 FIFA ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌ చేరిన మెస్సీ టీమ్

Next Story