బాల్ ట్యాంపరింగ్ చేసిన అశ్విన్.. సంచలన ఆరోపణలు చేసిన టీఎన్‌పీఎల్ టీం!

by Phanindra |

టీఎన్‌పీఎల్ ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడట. ఈ మేరకు ఒక టీం సంచలన ఆరోపణలు చేసింది.

బాల్ ట్యాంపరింగ్ చేసిన అశ్విన్.. సంచలన ఆరోపణలు చేసిన టీఎన్‌పీఎల్ టీం!
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా మాజీ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్‌పై తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్)లోని టీం సంచలన ఆరోపణలు చేసింది. దిండిగుల్ డ్రాగన్స్ జట్టుకు సారధ్యం వహిస్తున్న అశ్విన్.. తన టీంతో కలిసి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పపడ్డాడని మదురై పాంథర్స్ జట్టు కంప్లయింట్ చేసింది. అశ్విన్ టీం ఉపయోగించిన టవల్స్‌ను ఏవో కెమికల్స్‌లో ముంచి తెచ్చారని, దీంతో బంతి బరువు పెరిగిందని మదురై టీం ఆరోపణ. బంతిని బ్యాటుతో కొట్టినప్పుడు స్టీల్ బంతిని కొట్టినట్లు శబ్దం వచ్చిందని ఆ టీం చెప్తోంది. ఈ ఆరోపణలపై టీఎన్‌పీఎల్ సీఈవో ప్రసన్న కణ్ణన్ స్పందించారు.


‘మదురై పాంథర్స్ టీం ఫిర్యాదు చేసింది. మేం దాన్ని స్వీకరించాం. రూల్స్ ప్రకారం మ్యాచ్ జరిగిన 24 గంటల్లో ఫిర్యాదు చేయాలి. మదురై టీం అలా చేయకపోయినా ఫిర్యాదును మేం స్వీకరించాం. అయితే ఈ ఆరోపణలకు ఆధారం చూపించాలని కోరాం. అలాగే ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేలుస్తాం. ఏమాత్రం ఆధారాలు లేకుండా ఒక ప్లేయర్‌ని, ఫ్రాంచైజీని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఆధారాలు చూపించకపోతే మదురై టీంపై తప్పకుండా చర్యలుంటాయి’ అని ఆయన హెచ్చరించారు.

Next Story