షాహీన్ అఫ్రిది గాలి తీసేసిన గవాస్కర్.. అతనో నెట్ బాల్ స్పిన్నర్ అంటూ ఎద్దేవా

by Harish |

భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాలి తీసేశాడు.

షాహీన్ అఫ్రిది గాలి తీసేసిన గవాస్కర్.. అతనో నెట్ బాల్ స్పిన్నర్ అంటూ ఎద్దేవా
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది గాలి తీసేశాడు. అతనో నెట్ బాల్ స్పిన్నర్ అంటూ ఎద్దేవా చేశాడు. షాహీన్ అఫ్రిదిని తిలక్ వర్మ నెట్ బాల్ స్పిన్నర్‌గా ట్రీట్ చేశాడని వ్యాఖ్యానించాడు. పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. వారిద్దరూ అందించిన ఓపెనింగ్‌తో భారత్ విజయం ఖాయమైందన్నాడు. అలాగే, పాకిస్తాన్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లారని చెప్పాడు.

ఇక, చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌ను కూడా ప్రశంసించాడు. ‘తిలక్ మరో సూపర్ టాలెంటెండ్ బ్యాటర్. పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదిని అతను నెట్ బాల్ స్పిన్నర్‌గా ట్రీట్ చేశాడు. అతన్ని ఓ ఆటాడుకుని మరో 7 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.’అని కొనియాడాడు. ఆ మ్యాచ్‌లో తిలక్ 19 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. షాహీన్ అఫ్రిది వేసిన 19వ ఓవర్‌లో తిలక్ సిక్స్, ఫోర్ కొట్టి భారత్‌ను విజయతీరాలకు చేరాడు. అలాగే, ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ షాహీన్ అఫ్రిది ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.


Next Story