- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tilak Varma injury: తిలక్ వర్మ హెల్త్ అప్డేట్.. మొత్తం మూడు మ్యాచ్ లకు దూరం
తిలక్ వర్మ కు నిన్న సాయంత్రం సర్జరీ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక తిలక్ వర్మ ఆస్పత్రి నుంచి ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: భారత జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అందరూ ఊహించినట్లుగానే న్యూజిలాండ్ తో జరిగే మొదటి మూడు టీ20లకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దూరం కాబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బీసీసీఐ. న్యూజిలాండ్ వర్సెస్ భారత జట్టు మధ్య 5 టీ20 లు జరగనున్నాయి. ఈనెల 21వ తేదీ నుంచి ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే సర్జరీ కారణంగా మొదటి మూడు టి20 లకు తిలక్ వర్మ దూరం కాబోతున్నట్లు పేర్కొంది బీసీసీఐ. అయితే అతని స్థానంలో తుది జట్టులో ఎవరు ఆడతారనే దానిపైన బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ప్రకటించనుంది. అయితే న్యూజిలాండ్ తో జరిగే చివరి రెండు టీ20లకు తిలక్ వర్మ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అప్పటికి తిలక్ వర్మ ఫిట్నెస్ సాధించకపోతే ప్రత్యామ్నాయం చూడనుంది.
తిలక్ వర్మ హెల్త్ అప్డేట్
విజయ్ హజారే టోర్నమెంట్ ఆడుతున్న తిలక్ వర్మ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే అతనికి సర్జరీ జరిగింది. నిన్న సాయంత్రం తిలక్ వర్మ కు సర్జరీ చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక తిలక్ వర్మ ఆస్పత్రి నుంచి ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. రేపు హైదరాబాద్ తిలక్ వర్మ వస్తాడని ఈ క్లారిటీ ఇచ్చింది. ఫ్యాన్స్ ఎవరూ టెన్షన్ పడకూడదని కూడా పేర్కొంది.






