ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు.. ముగ్గురు భారత సంతతి మహిళల ఎంపిక

by Geesa Chandu |

సెప్టెంబర్ 19 నుంచి బ్రిస్బేన్ వేదికగా అండర్-19 ట్రై సిరీస్ (ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్) జరగనుంది. అయితే ఈ సిరీస్ లోని ఆస్ట్రేలియా జట్టులో ఆడేందుకు... ముగ్గురు భారత సంతతి మహిళలకు స్థానం దక్కింది.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు.. ముగ్గురు భారత సంతతి మహిళల ఎంపిక
X

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 19 నుంచి బ్రిస్బేన్ వేదికగా అండర్-19 ట్రై సిరీస్(ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్) జరగనుంది. అయితే ఈ సిరీస్ లోని ఆస్ట్రేలియా జట్టులో ఆడేందుకు.. ముగ్గురు భారత సంతతి మహిళలకు స్థానం దక్కింది. ఈ సిరీస్ కు రిబ్యా సయాన్, సమారా దుల్విన్, హస్రత్ గిల్ లను ఆస్ట్రేలియా జట్టు ఎంపిక చేసింది. అయితే ఈ ముగ్గురు క్రీడాకారులు భారత సంతతికి చెందిన వారు కావడం ప్రస్తుతం వైరల్ గా మారింది. బ్రిస్బేన్ లో జరిగే ఈ ట్రై సిరీస్ కు టీ20, వన్డే జట్టు కోసం ఆస్ట్రేలియా 15 మందితో కూడిన స్క్వాడ్ ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ప్రధాన కోచ్ గా క్రిస్టెన్ బీమ్స్ వ్యవహరించనున్నాడు. 14 రోజుల పాటు జరిగే ఈ ట్రై సిరీస్ లో అన్నిజట్లు 4 టీ20 మ్యాచ్ లు, 2 వన్డేలు ఆడనున్నాయి. అయితే భారత సంతతికి చెందిన ఈ ముగ్గురు ఆటగాళ్లు.. భవిష్యత్తులో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో చాలా గొప్ప పాత్ర పోషించబోతున్నారని, క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం (ఆగస్టు 22) ఒక ప్రకటనలో వెల్లడించింది.

Next Story