- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wimbledon: యుకీ, బాలాజీ, రిత్విక్ జోడీలు ముందంజ.. బోపన్న-గిలీ అవుట్!
వింబుల్డన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన యుకీ, బాలాజీ, రిత్విక్‌లు ముందంజ వేశారు. రోహన్ బోపన్న-గిలీ జోడీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది.

దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్ పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన యుకీ బంబ్రీ, తన అమెరికన పార్టనర్ రాబర్ట్ గాలోవే జోడీ సెకండ్ రౌండ్‌కు అర్హత సాధించింది. మొనాకోకు చెందిన రొమేన్ ఆర్నెండో, ఫ్రాన్స్‌కు చెందిన మాన్యూల్ గినార్డ్ జోడీపై 7-6(8), 6-4తో గెలిచిన బంబ్రీ-రాబర్ట్ ముందడుగు వేశారు. వీరితోపాటు భారత్ ప్లేయర్ ఎన్ శ్రీరామ్ బాలాజీ, మెక్సికన్ పార్టనర్ మిగుల్ రీయస్ వారేలాతో కలిసి అమెరికన్ జోడీ లెర్నర్ టీన్-అలెక్సాండర్ కోవాసెవిక్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించారు. దీంతో శ్రీరామ్-మిగుల్ జోడీ కూడా రెండో రౌండ్‌కు చేరింది.
అలాగే రిత్విక్ చౌదరీ బొల్లిపల్లి-నికోలస్ బెర్రింటోస్ జోడీ కూడా 6-4, 4-6, 6-7 తేడాతో అలెగ్జాండర్ ముల్లర్-డేవిడ్ గాఫిన్‌పై నెగ్గి రెండో రౌండ్ చేరింది. అయితే పలు మెడల్స్ నెగ్గి. రోహన్ బోపన్న, అతని బెల్జియన్ పార్టనర్ శాండర్ గిలీ తమ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి వింబుల్డన్ నుంచి నిష్క్రమించారు. అలాగే అర్జున్ కాధే, విట్ కొప్రీవా జోడీ కూడా తొలి రౌండ్ ఓటమితో టోర్నీ నుంచి తప్పుకుంది.






