- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు ఐసీసీ షాక్.. రన్నరప్ కెప్టెన్ వైపు మొగ్గు
భారత మహిళల క్రికెట్ జట్టు నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై అద్భుతమైన విజయం సాధించి తొలిసారిగా వరల్డ్ కప్‌ను ముద్దాడింది. ఐసీసీ మంగళవారం మహిళల ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. టీమ్‌లో 12 మందికి స్థానం దక్కింది. అందులో భారత్ నుంచి ముగ్గురికి స్థానం దక్కింది. బ్యాటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఎంపికయ్యారు. అయితే, భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కాకుండా రన్నరప్ సౌతాఫ్రికా సారథి వొల్వార్ట్‌ను టీమ్ ఆఫ్ ది టోర్నీకి కెప్టెన్‌గా ఎంపిక చేయడం గమనార్హం. హర్మన్‌కు కనీసం జట్టులో కూడా స్థానం దక్కలేదు. సౌతాఫ్రికా నుంచి వొల్వార్ట్‌తోపాటు ఆల్‌రౌండర్ మారిజన్నె కాప్, నాడినె డె క్లెర్క్, ఆస్ట్రేలియా నుంచి గార్డ్‌నెర్, సదర్లాండ్, అలానా కింగ్ ఎంపికయ్యారు. ఇంగ్లాండ్ ప్లేయర్లు నాట్ స్కివర్ బ్రంట్, ఎక్లోస్టోన్, పాకిస్తాన్ నుంచి సిడ్రా నవాజ్ జట్టులో చోటు సంపాదించారు.
ఉమెన్స్ వరల్డ్ కప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్
స్మృతి మంధాన, లారా వొల్వార్ట్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్ష్, మారిజన్నె కాప్, గార్డ్‌నెర్, దీప్తి శర్మ, సదర్లాండ్, నాడినె డె క్లెర్క్, సిడ్రా నవాజ్, అలానా కింగ్, ఎక్లోస్టోన్, నాట్ స్కివర్ బ్రంట్.






