'ఈ సాలా కప్ నమ్దే!'.. ఆర్సీబీని ఉత్సాహపరుస్తున్న డిప్యూటీ సీఎం స్పెషల్ వీడియో

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-03 11:37:03  IST  )

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతున్నప్పటికీ ఒక్కసారి కూడా కప్‌ను ముద్దాడలేకపోయింది.

ఈ సాలా కప్ నమ్దే!.. ఆర్సీబీని ఉత్సాహపరుస్తున్న డిప్యూటీ సీఎం స్పెషల్ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతూ వస్తున్నా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్‌ను ముద్దాడలేకపోయింది. అయినప్పటికీ, భారతీయ క్రికెట్ అభిమానుల్లో అత్యంత పెద్ద ఫ్యాన్ బేస్‌తో ఆర్సీబీ ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక ఈ టీమ్ ఐపీఎల్‌లో 18 సీజన్లలో పది సార్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ, టైటిల్ మాత్రం దక్కలేదు. అయితే, ఈసారి మాత్రం ఆర్సీబీ కఠినమైన పోటీలో ప్రత్యర్థుల్ని హడలెత్తిస్తూ 9 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఫ్యాన్స్ 'ఈ సాల కప్ నమ్దే!' అంటూ ఉత్సాహంతో రెచ్చిపోతున్నారు.

ఇక ఐపీఎల్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఉత్కంఠభరితమైన ఫైనల్‌ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు చరిత్ర సృష్టించబోతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం రెండు జట్లూ పట్టు చాటుకుని, విజయం సాధించి మొదటి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్సీబీ జట్టుకు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ (Deputy CM DK Shivakumar) ఆర్సీబీ జెర్సీ ధరించి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. '18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ప్రతి ప్రార్థన, ప్రతి ఉత్సాహం, ప్రతి హృదయ విదారకం ఇవన్నీ ఈ రోజు కోస‌మే. ఇది ఒక మ్యాచ్ మాత్రమే కాదు. మన క్షణం. మన కప్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్‌సీబీ. కర్ణాటక ప్ర‌జ‌లంతా పూర్తి మద్దుతుగా మీతోనే ఉన్నారు. ఈ సాలా కప్ నమ్దే' అని చెబుతూ డీకే శివ‌కుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఈసారి త‌ప్ప‌కుండా ఐపీఎల్ ట్రోఫీ ఆర్‌సీబీదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story