- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది మా హోమ్ గ్రౌండ్.. భారత్‌తో ఆటను పెద్ద మ్యాచ్‌గా పరిగణించము: UAE
ఈ రోజు రాత్రి 8 గంటలకు ఆసియా కప్ లో రెండో మ్యాచ్ యూఏఈ, భారత్ జట్లు మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో యూఏఈ కెప్టెన్ భారత్ తో మ్యాచుపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 (Asia Cup 2025) మంగళవారం నుంచి ప్రారంభం అయింది. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి దుబాయ్ వేదికగా యూఏఈ జట్టుతో భారత్ (UAE vs India) తలపడనుంది. ఈ క్రమంలో నేడు జరిగే రెండో మ్యాచ్ పై యూఏఈ జట్టు కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మీడియాతో మహమ్మద్ వసీం (Muhammad Wasim) మాట్లాడుతూ.. "అన్ని జట్లు మంచివి కాబట్టి మేము దీనిని పెద్ద మ్యాచ్ గా పరిగణించము, కాబట్టి అన్ని మ్యాచ్‌లు ఒకేలా ఉంటాయి. మేము చేస్తున్న కృషి, మా ప్రణాళికకు మేము కట్టుబడి ఉంటాము. మేము ఇన్ని రోజులు ఏమి నేర్చుకున్నామో అదే చేయడానికి ప్రయత్నిస్తాము. దాని ప్రకారం ప్రతి మ్యాచ్‌లో ముందుకు వెళ్తాము.
చివరి ఫలితం రెండు జట్ల ఆటపై ఆధారపడి ఉంటుంది. మేము ఇక్కడ అనేక సంవత్సరాలుగా మ్యాచులు ఆడుతున్నాము. భారతదేశం, పాకిస్తాన్ కూడా ఇక్కడ చాలా ఆడతాయని మీరు చెప్పవచ్చు. కానీ ఇది మా హోమ్ గ్రౌండ్, కాబట్టి మేము ప్రయోజనాన్ని పొంది మంచి క్రికెట్ ఆడటానికి మా వంతు ప్రయత్నం చేస్తాము." అని యూఏఈ జట్టు కెప్టెన్ ముహమ్మద్ వసీం చెప్పుకొచ్చాడు. కాగా ఈ రెండో మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనిని భారత్ లో సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో చూడవచ్చు.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (c), జితేష్ శర్మ (wk), అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, సంజు శాంసన్, రింకు సింగ్, శివమ్ దూబే
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్క్వాడ్: ముహమ్మద్ వసీమ్ (సి), రాహుల్ చోప్రా (వికె), అలీషాన్ షరాఫు, ఆసిఫ్ ఖాన్, ముహమ్మద్ జోహైబ్, హర్షిత్ కౌశిక్, ముహమ్మద్ ఫరూఖ్, ముహమ్మద్ జవదుల్లా, సగీర్ ఖాన్, హైదర్ అలీ, జునైద్ సిద్ధిఖ్, ముహమ్మద్ రోహిద్ ఖాన్, ఆర్యాన్ష్ శర్మ, ధృవ్ సిమ్‌జీ పరాస్‌హర్






