క్రికెట్ లో సరికొత్త చరిత్ర.. 25 రోజుల్లో 7 వేల పరుగులు, 21 సెంచరీలు

by velandi.Saikiran |

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఐదు టెస్టులు

క్రికెట్ లో సరికొత్త చరిత్ర.. 25 రోజుల్లో 7 వేల పరుగులు, 21 సెంచరీలు
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఐదు టెస్టులు జరగగా... చెరో రెండు గెలిచాయి. దీంతో అండర్సన్, టెండూల్కర్ టోర్నమెంట్ ( Anderson–Tendulkar Trophy ) డ్రాగా ముగిసింది. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్ మొత్తం 25 రోజుల పాటు కొనసాగింది.

25 రోజుల్లో 7,187 పరుగులు నమోదు అయ్యాయి. అలాగే 1860 ఓవర్స్ వేశారు బౌలర్లు. 175 వికెట్లు పడగొట్టారు ఇండియా అలాగే ఇంగ్లాండ్ బౌలర్లు. అలాగే ఈ ఐదు టెస్టుల సిరీస్ లో 21 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు కూడా నమోదు అయ్యాయి. ఇక 798 బౌండరీలు, 80 సిక్సర్స్ బాదారు ఇరుజట్ల ప్లేయర్లు. ఇది ఇలా ఉండగా... నిన్నటితో ఐదో టెస్టు ముగిసిన సంగతి తెలిసిందే. చివరలో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ వేయడంతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Next Story