మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు

by Malleboina Mahesh |

జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు మరోసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

మూడో టీ20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు
X

దిశ, వెబ్ డెస్క్: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు మరోసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండో టీ20 మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ కూడా జరుగుతుండటంతో, ఆట గడిచే కొద్దీ పిచ్ మందగించే (Slow Down) అవకాశం ఉందని భావించి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించినట్లు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. నిన్నటి మ్యాచ్‌లో 220 పరుగుల భారీ స్కోరు సాధించి అద్భుతమైన ప్రారంభాన్ని అందుకున్నామని, ఈ రోజు కూడా అదే తరహా ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పిచ్ ఎలా స్పందిస్తుందో ముందే ఊహించలేమని, పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడితే అంత మంచి స్కోరు బోర్డుపై ఉంచవచ్చని కెప్టెన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసినట్లు అయ్యర్ తెలిపారు. గాయం కారణంగా ప్రిన్స్ స్థానంలో అశోక్ శర్మ జట్టులోకి రాగా, శివమ్ దూబే స్థానంలో సూర్యాంశ్‌కు అవకాశం కల్పించినట్లు స్పష్టం చేశారు.

భారత్ ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(w), శ్రేయాస్ అయ్యర్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ

జింబాబ్వే ప్లేయింగ్ XI: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(సి), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(w), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ

Next Story