వన్డే కెప్టెన్‌గా గిల్.. గంగూలీ ఏమన్నాడంటే?

by Harish |

భారత వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించడం సరైన నిర్ణయమేనని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.

వన్డే కెప్టెన్‌గా గిల్.. గంగూలీ ఏమన్నాడంటే?
X

దిశ, స్పోర్ట్స్ : భారత వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి శుభ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగించడం సరైన నిర్ణయమేనని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. ‘సరైన నిర్ణయమేనని అనుకుంటున్నా. రోహిత్ ఆడుతూనే ఉంటాడు. మరోవైపు, యువ కెప్టెన్‌ను తీర్చిదిద్దుతారు. కాబట్టి, ఇందులో ఎలాంటి సమస్య నాకు కనిపించడం లేదు.’అని తెలిపాడు. రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై స్పందిస్తూ.. వాళ్లిద్దరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాడు. రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటంపై అనుమానం వ్యక్తం చేశాడు. అప్పటికీ అతనికి 40 ఏళ్లు వస్తాయని, ఆ వయసులో కష్టమేనన్నాడు. అయితే, అతని ఫిట్‌నెస్, ఎంత వరకు క్రికెట్ ఆడతాడు అనే విషయాలపై ఆధారపడి ఉంటుందన్నాడు.


Next Story