మొదలైన విజయ్ ‘జిల్లా’ మాస్ బీభత్సం

by Pulgam srinivas |

జూన్ 19న రీ-రిలీజ్ కానున్న విజయ్ 'జిల్లా' చిత్రం. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే సుమారు 4,500 టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.

మొదలైన విజయ్ ‘జిల్లా’ మాస్ బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'జిల్లా' మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. 2014 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు మోహన్‌లాల్ కీలక పాత్ర పోషించగా, ఆర్.టి. నేసన్ దర్శకత్వం వహించారు. విజయ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, సూరి, మహత్, నివేదా థామస్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించింది.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను జూన్ 19న రీ-రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నట్లు సమాచారం. మొదటి రోజు ప్రదర్శనల కోసం సుమారు 4,500 టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రీ-రిలీజ్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే ఈ స్థాయి స్పందన రావడంతో 'జిల్లా' పలు రీ-రిలీజ్ రికార్డులను బద్దలు కొట్టే అవకాశముందని విజయ్ అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమా రీ-రిలీజ్ ద్వారా ఎలాంటి ప్రభావం చూపించనుందనే అంశం ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Next Story