ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. వారిద్దరి మధ్యే ప్రధాన పోటీ?

by Naga Rani Yarlagadda |

జార్ఖండ్ లోని రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి గురువారం ఉదయం.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రారంభమయింది.

ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్.. వారిద్దరి మధ్యే ప్రధాన పోటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ లోని రెండు రాజ్యసభ స్థానాల భర్తీకి గురువారం ఉదయం.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రారంభమయింది. ఈ రెండుస్థానాల కోసం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి అయిన పరిమల్ నత్వానికి బీజేపీ మద్దతివ్వగా.. జేఎంఎం నుంచి బైద్యనాథ్ రామ్, కాంగ్రెస్ నుంచి ప్రణవ్ ఝా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఉదయం 9 గంటలకు పోలింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది. క్రాస్ ఓటింగ్ భయాల నడుమ.. భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు.. తర్వాత ఫలితాన్ని ప్రకటించనున్నారు.

జార్ఖండ్ అసెంబ్లీలో 81 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఎగువసభకు ఎన్నికవ్వాలంటే.. ఒక్కో అభ్యర్థికి సుమారు 28 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరం. NDA కూటమికి ఇక్కడ 24 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇండియా కూటమికి 56 మంది సభ్యుల బలం ఉంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో గెలుపు తమదే అవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే.. అధికార జేఎంఎం పార్టీకి ఒంటరిగానే 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున ఆ పార్టీ అభ్యర్థి బైద్యనాథ్ రామ్ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్‌కు 16 మంది, ఆర్జేడీకి నలుగురు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో రాజ్యసభ స్థానంపైనే నెలకొంది. ఈ సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా, ఎన్డీయే మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వాని మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది.

Next Story