కన్నప్ప రీ-రిలీజ్‌కు రంగం సిద్ధం.. మరోసారి వెండితెరపై సందడి

by Pulgam srinivas |

మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ చిత్రాన్ని జూన్ 27న మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కన్నప్ప రీ-రిలీజ్‌కు రంగం సిద్ధం.. మరోసారి వెండితెరపై సందడి
X

దిశ, వెబ్ డెస్క్: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మించారు.

‘కన్నప్ప’ చిత్రం 2025 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ తారాగణం, పౌరాణిక నేపథ్యం కారణంగా మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూన్ 27న ప్రత్యేక రీ-రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో ఈసారి ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.





Next Story