నాగబంధం ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. వేదిక, తేదీ ఖరారు

by Pulgam srinivas |

'నాగబంధం' ట్రైలర్‌ను జూన్ 19న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని PRASADS PCXలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

నాగబంధం ట్రైలర్ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. వేదిక, తేదీ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: యువ హీరో విరాట్ కర్ణ కథానాయకుడిగా నటించిన 'నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటించగా, అభిషేక్ నామ దర్శకత్వం వహించారు. దక్ష నగార్కర్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్న టీమ్, తాజాగా ట్రైలర్ విడుదల తేదీ మరియు వేదికను అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 19న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని PRASADS PCXలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే చిత్రబృందం కూడా సినిమాపై పూర్తి నమ్మకంతో ఉండటం ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రానికి జునైద్ కుమార్, అభే సంగీతం అందించగా, కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు.




Next Story