ICC Champions Trophy: భారత్- బంగ్లా మ్యాచ్.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులివే

by Yella Dhawani Reddy |   (  Updated:2025-02-20 10:43:21  IST  )

ప్రస్తుతం భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది.

ICC Champions Trophy: భారత్- బంగ్లా మ్యాచ్.. రోహిత్‌ను ఊరిస్తున్న రికార్డులివే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో (ICC Champions Trophy) పాల్గొంటుంది. ఇందులో భాగంగా గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ వర్మ (Rohit Sharma) పలు రికార్డులను తన సొంతం చేసుకోనున్నాడు. అవేంటంటే..

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో 12 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. అంతేకాదు, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అలాగే, ఈ ఘనత సాధిస్తే 11వేల మైలురాయిని అందుకునే నాలుగో భారత ఆటగాడిగా రోహిత్‌ నిలుస్తాడు. ఇక ఇప్పటివరకు రోహిత్ 260 ఇన్నింగ్స్‌ల్లో 10,988 రన్స్‌ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ ఈ భారీ రికార్డ్‌ను సాధించే అవకాశం ఉంది. ఈ అరుదైన జాబితాలో విరాట్ కోహ్లీ (Virat Kohli) అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లో, సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించారు.

అలాగే, ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సెంచరీ సాధిస్తే రెండు ప్రపంచకప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ సీజన్లలో బంగ్లాపై శతకం బాదిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. అంతకుముందు 2015లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌ బంగ్లాపై (క్వార్టర్‌ఫైనల్‌) 137 పరుగులు చేశాడు. ఇక, 2017లో జరిగిన ఛాంపియన్‌ ట్రోఫీ టోర్నీలో భాగంగా ఇదే జట్టుపై సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 123 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2019లో వన్డే ప్రపంచకప్‌ లీగ్‌ దశలో బంగ్లాపై మళ్లీ సెంచరీతో అదరగొట్టాడు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్‌లో 50, అంతకంటే ఎక్కువ సెంచరీలు కొట్టిన 10వ బ్యాటర్‌గా మరో ఘనత అందుకుంటాడు.

ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాపై విజయం సాధిస్తే.. భారత్‌ తరఫున 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు నెగ్గిన 4వ కెప్టెన్‌గా హిట్ మ్యాన్ అరుదైన ఘనత సాధిస్తాడు. అలాగే, 14 సిక్స్‌లు బాదితే వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా అగ్రస్థానంలో నిలుస్తాడు.

Next Story