- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన వీరులు వీళ్లే..
టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh Pant) అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2025 టోర్నమెంటులో పెద్దగా రాణించని... టెస్ట్ క్రికెట్లో మాత్రం దుమ్ము లేపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను... ఆదుకొని, మొదటి ఇన్నింగ్స్ అలాగే రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీలతో రాణించాడు.
రెండవ ఇన్నింగ్స్... కె ఎల్ రాహుల్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు రిషబ్ పంత్. ఈ తరుణంలోనే 140 బంతుల్లో 118 పరుగులు చేశాడు రిషబ్ పంత్. ఇందులో 15 బౌండరీలు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే ఇలా ఒకే టెస్ట్ మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసిన.. ప్లేయర్ల లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం. ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసిన భారత ప్లేయర్లలో... విజయ్ హజారే, సునీల్ గవాస్కర్ మూడుసార్లు, రాహుల్ ద్రావిడ్ రెండుసార్లు, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ , రిషబ్ పంత్ ఈ లిస్టులో ఉన్నారు.






