నా కొడుకు క్రికెట్ ఆడటం నాకు ఇష్టం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

by Harish |

తన కొడుకు క్రికెట్ ఆడటం తనకు ఇష్టం లేదని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు.

నా కొడుకు క్రికెట్ ఆడటం నాకు ఇష్టం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్
X

దిశ, స్పోర్ట్స్ : తన కొడుకు క్రికెట్ ఆడటం తనకు ఇష్టం లేదని భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడిని క్రికెటర్‌గా చూడాలనుకోవడం లేదన్నాడు. ఒకవేళ అతను క్రికెట్ కావాలని కోరుకుంటే మాత్రం తాను అడ్డుచెప్పనని తెలిపాడు. ‘ప్రస్తుతం ఓ పిల్లాడు క్రికెట్ ఆడుతున్నాడంటే అతనిపై భరించలేనంత ఒత్తిడి ఉంటుంది. చాలా మంది యువ క్రికెటర్లను వాళ్ల నాన్నతో పోలుస్తూ చర్చిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఒకే రంగంలో అందరికీ ప్రతిభ ఉండాలని లేదు. అందరూ సమానంగా రాణించలేరు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో టాలెంట్ ఉంటుంది. కాబట్టి, ఎవరి ఇష్టాలకునుగుణంగా వారిని ఎదిగేందుకు ప్రోత్సహించాలి.’అని యువీ చెప్పుకొచ్చాడు. కాగా, టీ20 వరల్డ్ కప్-2007, వన్డే వరల్డ్ కప్-2011 టైటిల్స్ సాధించిన భారత జట్టులో యువీ సభ్యుడు. శుభ్‌మన్ గిల్, అభిషేక్ వర్మ వంటి యువ ప్లేయర్లకు యువీ మెంటార్‌గా ఉన్నాడు. 2017లో హాజిల్ కీచ్‌ను యువీ వివాహం చేసుకున్నాడు. యువీ దంపతులకు మొదటి సంతానంగా కుమారుడు ఓరియన్ జన్మించగా.. రెండో సంతానంగా కుమార్తె ఆరా పుట్టింది.


Next Story