కోహ్లీ నువ్వు తిరిగి రావాలి.. 1983 వరల్డ్ కప్ హీరో మదన్‌లాల్ కీలక వ్యాఖ్యలు

by Harish |

కోహ్లీ నువ్వు తిరిగి రావాలి.. 1983 వరల్డ్ కప్ హీరో మదన్‌లాల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విరాట్ రిటైర్మెంట్‌పై భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టు సభ్యుడు మదన్ లాల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలన్నాడు. తిరిగి టెస్టులు ఆడాలని కోరాడు. తాజాగా ఓ షోలో పాల్గొన్న మదన్‌లాల్‌ను కోహ్లీ రిటైర్మెంట్ గురించి అడిగారు. దానికి మదన్‌లాల్ స్పందిస్తూ..‘భారత క్రికెట్‌పై విరాట్ కోహ్లీకి ఉన్న అభిరుచి సాటిలేనిది. నా కోరిక ఏంటంటే అతను తిరిగి టెస్టు క్రికెట్‌లోకి రావాలి. తిరిగి రావడంలో ఎలాంటి తప్పు లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆడకపోయినప్పటికీ తర్వాతి సిరీస్ నాటికైనా అతను పునరాగమనం చేయాలి.’అని మదన్‌లాల్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికీ కోహ్లీ ఇంటెన్సిటీ, కమిట్‌మెంట్, ఫిట్‌నెస్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయన్నాడు. డ్రెస్సింగ్ రూంలో కోహ్లీలాంటి ఆటగాడు ఉండటం యువ ప్లేయర్లకు స్ఫూర్తినిస్తుందని చెప్పాడు. ఇటీవల రిటైర్మెంట్‌పై కోహ్లీ మాట్లాడుతూ.. సరైన సమయని భావించినందు వల్లే టెస్టులకు వీడ్కోలు పలికినట్టు తెలిపాడు.


Next Story