పాక్‌ కుట్ర‌లు..ఇండియా నుంచి త‌ర‌లిపోనున్న రెండు ఐసీసీ టోర్న‌మెంట్లు!

by velandi.Saikiran |

భారతదేశం-పాకిస్తాన్ రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2031 వరకు ఇండియాలో ఐసిసి ఈవెంట్‌లు ఉండబోవంటూ ఓ న్యూస్ వైర‌ల్ గా మారింది.

No ICC events in India
X

No ICC events in India

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 జరుగుతోన్న నేపథ్యంలో ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపై ఇండియాలో ఐసీసీ ( ICC) ఈవెంట్స్ నిర్వహించబోమని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు పోస్టులు వైరల్ చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య రాజకీయ కారణాల వల్ల ఐసీసీ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఈ రెండు దేశాల రాజకీయాల కారణంగా 2031 వరకు ఇండియాలో ఐసీసీ ఈవెంట్స్ నిర్వహించకూడదని ఐసీసీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పాకిస్తాన్ కుట్రలు.. ఇండియాకు షాక్ ఇచ్చేందుకు ఐసీసీ రంగం సిద్ధం ?

పాకిస్తాన్ కుట్రల కారణంగా ఇండియాకు ( India) షాక్ ఇచ్చేందుకు ఐసీసీ రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం 2029 ఛాంపియన్స్ ట్రోఫీ ( 2029 Champions Trophy ), 2031 వన్డే వరల్డ్ కప్ ( 2031 ODI World Cup) రెండు కూడా ఇండియాలో జరగాలి. అయితే ఈ ఈవెంట్స్ ఇండియాలో నిర్వహిస్తే పాకిస్తాన్ కోసం స్పెషల్ గా తటస్థ వేదికను సిద్ధం చేయాలి. దుబాయ్, శ్రీలంక, ఇలా ఏదో ఒక వేదికను పాకిస్తాన్ కోసం సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఐసీసీకి తీవ్రస్థాయిలో నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. మొన్న టీ20 వరల్డ్ కప్ 2026 సందర్భంగా పాకిస్తాన్ కోసం కొలంబోను ఫిక్స్ చేశారు. అయినప్పటికీ ఇండియాతో మ్యాచ్ ఆడకుండా బహిష్కరిస్తామని పాకిస్తాన్ డ్రామాలాడింది.

రెండు దేశాల రాజకీయాల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక భవిష్యత్తులో కూడా ఇండియాలో ఈవెంట్స్ నిర్వహిస్తే, పాకిస్తాన్ ( Pakistan) అచ్చం ఇలాగే వ్యవహరించే ప్రమాదం ఉంటుంది. వీటన్నిటి కంటే ఇండియాలో ఐసీసీ ఈవెంట్స్ నిర్వహించకుండా ఆస్ట్రేలియాలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సర్వం సిద్ధం చేస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇదే జరిగితే భారత క్రికెట్ నియంత్రణ మండలికి ( BCCI) తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం కూడా ఉంటుంది. దీనికి బీసీసీఐ అంగీకారం కూడా కావాల్సి ఉంటుంది.

మరి ఐసీసీ ఆ దిశగా అడుగులు వేస్తే బీసీసీఐ ఒప్పుకునే అవకాశం లేనట్లు సమాచారం. మరి దీనిపై నిజంగానే ఐసీసీ ముందుకు వెళ్తుందా? లేదా? అనేది త్వరలోనే క్లారిటీగా తెలుస్తుంది. అయితే ఈ న్యూస్ బయటకు రావడంతో పాకిస్తాన్ పై క్రికెట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ కుట్రల కారణంగానే ఇప్పుడు ఇండియాకు నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే పాకిస్తాన్ జట్టును ఈ టోర్నమెంట్ నుంచి తొలగించాలని కోరుతున్నారు. మరి ఐసీసీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఇది ఇలా ఉండ‌గా, మొన్న కొలంబో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో భార‌త్ చేతిలో పాక్ ఓడింది.

Next Story