- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hong Kong Sixes : హాంకాంగ్ సిక్సెస్ క్రికెట్ 2024 విజేత శ్రీలంక
హాంకాంగ్ సిక్సెస్(Hong Kong Sixes) 2024 క్రికెట్ టోర్నీ విజేతగా శ్రీలంక(Sri Lanka) నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్ : హాంకాంగ్ సిక్సెస్(Hong Kong Sixes) 2024 క్రికెట్ టోర్నీ విజేతగా శ్రీలంక(Sri Lanka) నిలిచింది. ఫైనల్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 5.2ఓవర్లలో 72పరుగులు చేసింది. గెలుపు కోసం 72పరుగుల లక్ష్య చేదనను శ్రీలంక 3వికెట్లు కోల్పోయి సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో వీరక్కోడి 13బంతుల్లో 34, మధు శంక 5బంతుల్లో 19, రత్నాయకే 4బంతుల్లో 16పరుగులు చేశారు. హాంకాంగ్ సిక్స్ (సిక్స్-ఎ-సైడ్) అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ లో 12జట్లు పాల్గొన్నాయి. నవంబర్ 1నుంచి 3వరకు జరిగిన ఈ ఐసీసీ టోర్నిలో టీమిండియా సిక్సెస్ జట్టు ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ ఓడి చెత్త ప్రదర్శనను మూటగట్టుకుంది. ఇటీవల టీమిండియా పురుషుల, మహిళల జట్లతో పాటు టీమిండియా ఏ జట్లు, యువ భారత్ జట్లు వివిధ టోర్నీలతో పాటు ద్వైపాక్షిక సిరీస్ లలో అధిక పరాజయాలు పొందడం క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది.






