ఐపీఎల్‌లో ముగ్గురు కెప్టెన్ల వేటుకు రంగం సిద్ధం.. భారీ మార్పుల దిశగా ఆ ఫ్రాంచైజీలు

by Malleboina Mahesh |

పేలవ ప్రదర్శన మరియు నాయకత్వ లోపాలతో ఢిల్లీ, లక్నో, కోల్‌కతా జట్ల కెప్టెన్లను మార్చే అవకాశం ఉంది. వచ్చే సీజన్ నాటికి కొత్త సారథులు మరియు కోచింగ్ స్టాఫ్‌తో బరిలోకి దిగాలని ఆయా జట్ల యాజమాన్యాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ముగ్గురు కెప్టెన్ల వేటుకు రంగం సిద్ధం.. భారీ మార్పుల దిశగా ఆ ఫ్రాంచైజీలు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ రేసుకు.. కీలకమైన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సీజన్ లో దారుణ ఓటములను చవిచూసిన ట్లు కెప్టెన్లపై వేటుకు ఆయా ఫ్రాంచైజీలు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2026 లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న జట్లపై ఆయా ఫ్రాంచైజీల యాజమాన్యాలు కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. గత రెండు సీజన్లుగా తమ జట్లను ప్లేఆఫ్స్ (Playoffs)కు చేర్చడంలో విఫలమవడమే కాకుండా, వ్యక్తిగత ప్రదర్శనతో జట్టుకు భారంగా మారుతున్నారనే కారణంతో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్లపై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ ఇందులో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే అక్షర్ పటేల్, అజింక్యా రహానేలను కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించి, కొత్త నాయకత్వంతో వచ్చే సీజన్ బరిలోకి దిగాలని ఓనర్లు యోచిస్తున్నట్లు క్రీడా వర్గాల సమాచారం. కేవలం బ్యాటింగ్‌లో రాణించకపోవడమే కాకుండా, మైదానంలో వ్యూహాలను అమలు చేయడంలోనూ, బెంచ్ ప్లేయర్లను సరైన రీతిలో వినియోగించుకోవడం లో వీరు విఫలమవుతున్నారని యాజమాన్యాలు భావిస్తున్నాయి.

ముఖ్యంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జట్టు ఓటములకు ప్రధాన కారణంగా మారుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేవలం కెప్టెన్లనే కాకుండా, మొత్తం కోచింగ్ స్టాఫ్‌ను కూడా ప్రక్షాళన చేయాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. కొత్త కోచ్‌లు, కొత్త సారథులతో జట్ల రూపురేఖలు మార్చి, వచ్చే సీజన్‌లో బలమైన పోటీని ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మేరకు వారిని వచ్చే ఐపీఎల్ మెగా వేలానికి వదిలేసే అస్కారం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Next Story