- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జో రూట్ సెంచరీ..ఆస్ట్రేలియా క్రికెటర్ సంబరాలు
బ్రిస్బెన్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం యాషెస్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మొదటి టెస్ట్ పూర్తి కాగా, నేటి నుంచి రెండో టెస్టు కూడా ప్రారంభమైంది. బ్రిస్బెన్ వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, ఇప్పటి వరకు 9 వికెట్లు నష్టపోయి 323 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలమయ్యాయి.
కానీ ఆపద్బాంధవుడు జో రూట్ చాలా రోజుల తర్వాత సెంచరీ నమోదు చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై తన తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. నేటి మ్యాచ్ లో ఇప్పటి వరకు 201 బంతులు ఎదుర్కొన్న జో రూట్ 134 పరుగులు సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ, తన పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో జో రూట్ సెంచరీ చేయడం పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ సంబరాలు చేసుకున్నాడు. జో రూట్ సెంచరీ చేయగానే, yes అంటూ చాలా జాలిగా కనిపించాడు హెడెన్. అతడు సెంచరీ చేయడం తనకు ఆనందంగా ఉందంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. క్లిక్






