ఎదురీదుతోన్న భారత జట్టు.. 25 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే

by Kema Shiva Kumar |

మహిళల వన్డే వరల్డ్ కప్ (Women One Day World Cup) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

ఎదురీదుతోన్న భారత జట్టు.. 25 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల వన్డే వరల్డ్ కప్ (Women One Day World Cup) అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గౌహతీ (Guwahati) వేదికగా భారత (India) జట్టు శ్రీలంక (Srilanka)తో తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన భారత ఓపెనర్లు ప్రతిక రావల్, స్మృతి మందాన ఇన్సింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. ఈ క్రమంలోనే 10 బంతుల్లో 8 పరుగులు చేసిన స్మృతి, ఉదేశిక ప్రబోధని బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన హర్లీన్ డియోల్ ఓపెనర్ ప్రతిక రావల్‌తో కలిసి వేగంగా ఆడుతూ.. స్కోర్‌ బోర్డును పరిగెత్తించింది. అనంతరం ప్రతిక 59 బంతుల్లో 37 పరుగులు చేసిన ఇనోక రణవీరా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయింది. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ధాటిగా ఆడుతుంది. 24వ ఓవర్‌లో హర్లీన్ 64 బంతుల్లో 48 పరుగులు చేసి ఇనోక రణవీరా చేతికి చిక్కింది. ఇక జెమిమా రోడ్రిగ్జ్ డకౌట్ కాగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 19 బంతుల్లో 21 పరుగులు చేసి చేతులారా వికెట్ సమర్పించుకుంది. 25 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 5 కీలక వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. దీప్తీ శర్మ 1 పరుగు, రిచా ఘోష్ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.

Next Story