- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ పై సిరీస్ గెలవడమే లక్ష్యం.. ఆసీస్ స్టార్ బ్యాటర్
ఆధునిక క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ గా పేరున్న ఆటగాడు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్.. స్టీవ్ స్మిత్.

దిశ, వెబ్ డెస్క్: ఆధునిక క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ గా పేరున్న ఆటగాడు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్.. స్టీవ్ స్మిత్. ఇప్పుడు అతని వయస్సు 35 ఏళ్లు దాటింది. అందుకే కాబోలు ఇప్పుడు స్టీవ్ స్మిత్ పై రిటైర్మెంట్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అతని ఆటతీరు చూస్తే అలానే అనిపిస్తుంది. టీ20 లలో స్థానాన్ని కోల్పోవడం, టెస్టుల్లో పేలవ ఆటతీరు, వన్డేలలో అడపాతడపా అవకాశాలు రావడం. దీంతో ఈ ఆసీస్ బ్యాటర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. అయితే తన రిటైర్మెంట్ పై వస్తున్న ఈ పుకార్లను కొట్టిపారేశాడు స్మిత్. ప్రస్తుతానికి తనకు రిటైర్మెంట్ ఆలోచన ఏమీలేదని తేల్చి చెప్పేశాడు స్మిత్. రిటైర్మెంట్ పై స్టీవ్ మాట్లాడుతూ.. " నేను ప్రస్తుతానికి నా ఆటను ఆస్వాదిస్తున్నా. రిటైర్మెంట్ గురించి నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. సమ్మర్ లో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాను. భారత్ చాలా బలమైన జట్టు. దాంట్లో ఏ సందేహం లేదు. ఈ సిరీస్ లో మాకు గట్టి ఛాలెంజ్ గా భారత్ నిలుస్తుంది. ప్రపంచంలో రెండు అత్యుత్తమ టెస్ట్ జట్లు ఆడబోయే ఈ ట్రోఫీ కోసం, ఎదురుచూస్తున్నాను". అని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.






