- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరికొద్ది గంటల్లో India vs Pakistan ఫైనల్ మ్యాచ్.. దేశవ్యాప్తంగా పూజలు
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ రోజు రాత్రి నేడు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తలపడనుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025లో భాగంగా ఈ రోజు రాత్రి నేడు దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ ఆసియా కప్ సిరీస్ ఇప్పటికే రెండు సార్లు ఇరు జట్లు తలపడగా.. రెండింటిలోను భారత జట్టు భారీ విజయం సాధించింది. తాజాగా ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు మరోసారి తలపడనుండటంతో ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. ఈ మ్యాచ్ ముందు భారత అభిమానులు జట్టుకు విజయం రావాలని ప్రార్థనలు నిర్వహిస్తూ తమ మద్దతును అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్‌లోని భక్తులు గంగా ఆర్తీ నిర్వహించి, టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో సైతం క్రికెట్ ప్రేమికులు భారత జట్టు విజయం కోసం పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత జట్టు చరిత్రలో ఇప్పటి వరకు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఈ రోజు రాత్రి కోసం ఎంతగానో వేచి చేస్తున్నారు. కాగా రాత్రి ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచును భారతీయులు సోనీ స్పోర్ట్స్ , సోనీ లైవ్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చు.
భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (c), సంజు శాంసన్ (wk), అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, జితేష్ శర్మ, రింకు సింగ్, శివమ్ దూబే
పాకిస్థాన్ జట్టు:
సల్మాన్ అఘా (c), మహమ్మద్ హారీస్ (wk), సాహిబ్ జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, హుస్సేన్ తలత్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, ఖుష్దిల్ షా, మహ్మద్ వాసిమ్, సుష్దిల్ షా, మహ్మద్ వాసిమ్ జ్జా, సల్మాన్ వాసిమ్ ముఖీం






