కంగారుల‌కు టెన్ష‌న్.. నేడు తేలనున్న భవితవ్యం

by velandi.Saikiran |   (  Updated:2026-02-17 11:17:34  IST  )

ఇవాళ జింబాబ్వే, ఐర్లాండ్ ఫ‌లితంపై ఆస్ట్రేలియా భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది. జింబాబ్వే గెలిస్తే ఆసీస్ ఎలిమినేట్.

After Australia Upset, Zimbabwe Aim To Beat Ireland With Super 8 Spot In Sight
X

After Australia Upset, Zimbabwe Aim To Beat Ireland With Super 8 Spot In Sight

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ మరో మూడు కీలక మ్యాచ్ లు జరగనున్నాయి. ఉదయం 11 గంటల సమయంలో న్యూజిలాండ్, కెనడా మధ్య కీలక ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు జింబాబ్వే, ఐర్లాండ్ తలపడతాయి. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు ( Australia) చాలా కీలకం కానుంది. అలాగే సాయంత్రం ఏడు గంటలకు స్కాట్లాండ్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది.

నేడు తేలనున్న ఆస్ట్రేలియా భవితవ్యం

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్ ( Ireland), జింబాబ్వే ( Zimbabwe) మధ్య మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో జింబాబ్వే విక్టరీ కొడితే, ఆస్ట్రేలియాకు షాక్ తప్పదు. జింబాబ్వే గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ ఐర్లాండ్ గెలిస్తే, ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభిస్తుంది. కానీ జింబాబ్వేకు మరో మ్యాచ్ కూడా ఉంది. అందులో అయినా జింబాబ్వే గెలిస్తే, ఆస్ట్రేలియాకు ఎలిమినేషన్ త‌ప్ప‌దు. ఇక ఇవాళ కెనడాపై న్యూజిలాండ్ గెలిస్తే సూపర్ 8 కు వెళ్లనుంది. అటు స్కాట్లాండ్, నేపాల్ రెండు జట్లు కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. శ్రీలంక, భారత జట్టు, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు సూపర్ 8 లోకి వచ్చాయి. సూపర్ 8 లో భాగంగా ఇండియా మొత్తం మూడు మ్యాచ్ లు ఆడే ఛాన్స్ ఉంది.

Next Story