ఆ ట్రోఫీ.. మాకు 'యాషెస్'తో సమానం! ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్

by Geesa Chandu |

140 ఏళ్ల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్ కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది.

ఆ ట్రోఫీ.. మాకు యాషెస్తో సమానం! ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్
X

దిశ, వెబ్ డెస్క్: 140 ఏళ్ల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్ కు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఈ సిరీస్ లోని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే పోరుకు, ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదంటే అతిశయోక్తి కాదేమో! ప్రతీ ఏడూ సరికొత్త ఆటగాళ్లతో, సరికొత్త వ్యూహాలతో ఇరుజట్లు చేసే పోరాటానికి అటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ఇటు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ఈ సిరీస్ అంటేనే.. ఊగిపోతారు. యాషెస్ సిరీస్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న ట్రోఫీ.. సిరీస్ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీనే. ఈ ట్రోఫీని ఆస్ట్రేలియన్ పేసర్ స్టార్క్ యాషెస్ తో పోల్చాడు, ఈ రెండు సిరీస్ లు సమానమేనని అన్నాడు. భారత్ తో జరగబోయే బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ, ఇప్పుడు 3 దశాబ్దాల తర్వాత.. తొలిసారిగా ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ గా మారటంతో ఈ ట్రోఫీ తమ జట్టుకు గౌరవప్రదమైన యాషెస్ సిరీస్ తో సమానమని ఈ ఆస్ట్రేలియన్ పేసర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. స్టార్క్ ఈ సిరీస్ లో జరిగే ప్రతి మ్యాచ్ లో, భారత్ ను క్లీన్ స్వీప్ చెయ్యాలని తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

Next Story