ఆ షో నన్ను చాలా భయపెట్టింది.. టీమిండియా స్టార్ ప్లేయర్

by Geesa Chandu |

టీమిండియా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. కాఫీ విత్ కరణ్ షో ఎపిసోడ్ కాంట్రవర్సీపై మొదటిసారి పెదవి విప్పాడు.

ఆ షో నన్ను చాలా భయపెట్టింది.. టీమిండియా స్టార్ ప్లేయర్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్.. కాఫీ విత్ కరణ్ షో ఎపిసోడ్ కాంట్రవర్సీపై మొదటిసారి పెదవి విప్పాడు. ఈ షో జరిగిన తర్వాత వచ్చిన విమర్శలు తనను ఎంతో భయపెట్టాయని రాహుల్ అన్నాడు. ఈ వివాదమే తనను మనిషిగా మార్చిందని వెల్లడించాడు. అయితే ఐదేళ్ల కింద బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్వహించే ఒక టాక్ షో లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా పాల్గొన్నారు. కాగా ఈ షోలో మహిళలపై రాహుల్, పాండ్యా చేసిన కామెంట్లు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో వారిద్దరిని బీసీసీఐ సస్పెండ్ కూడా చేసింది. అయితే తాజాగా కేఎల్ రాహుల్ ఆ వివాదాన్ని గురించి ఇప్పుడు గుర్తు చేసుకున్నాడు.

ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. "కాఫీ విత్ కరణ్ షో నన్ను భయపెట్టడమే కాదు, నన్ను పూర్తిగా మార్చేసిందని రాహుల్ తెలిపాడు. తనకు చిన్నప్పటి నుంచి సిగ్గు చాలా ఎక్కువని, ఎవరితో ఎక్కువ మాట్లాడేవాన్ని కూడా కాదు. ఎప్పుడైతే టీమిండియాకు ఆడానో అప్పటినుండి తనలో ఆత్మా విశ్వాసం పెరిగిందని అన్నాడు. కానీ కరణ్ షో లో జరిగిన ఇంటర్వ్యూ తనను భయపెట్టిందని, దాని వల్లే తాను ఒక సిరీస్ నుంచి సస్పెండ్ కూడా అయ్యానని, కరణ్ ఇంటర్వ్యూ నా జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన అనుభవం" అని రాహుల్ వెల్లడించాడు.

Next Story