Badminton : సాత్విక్ జోడీకి నిరాశ.. ఫైనల్‌లో ఓటమి

by Harish |

Badminton : సాత్విక్ జోడీకి నిరాశ.. ఫైనల్‌లో ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలకు నిరాశే ఎదురైంది. టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన ఈ భారత జంట తుది మెట్టుపై మాత్రం బోల్తా పడింది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో ఓడిపోయి రన్నరప్‌గా సరిపెట్టింది. ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కర్నాండో-డేనియల్ మార్టిన్ జోడీ చేతిలో 21-12, 25-23 తేడాతో పరాజయం పాలైంది. దాదాపు గంటపాటు సాగిన మ్యాచ్‌లో విజయం కోసం సాత్విక్ జోడీ తీవ్రంగానే పోరాడింది. తొలి గేములో ప్రత్యర్థుల హవానే కొనసాగినప్పటికీ రెండో గేములో మాత్రం ప్రతిఘటించింది. రెండు జంటలు పోటాపోటీగా పాయింట్స్ కోసం పోటీపడ్డాయి. ఒక దశలో సాత్విక్, చిరాగ్ 16-14తో లీడ్‌లోకి వెళ్లినా.. ఆ తర్వాత ఆధిక్యం మారుతూ వచ్చింది. ఈ రసవత్తర పోరులో చివరికి సాత్విక్ జోడీకి పరాభవం ఎదురవ్వగా.. టైటిల్ కోల్పోయింది. సాత్విక్, చిరాగ్ జంట ఓ టోర్నీలో టైటిల్ గెలిచి రెండేళ్ల అయిపోయింది. ఈ టోర్నీలో ఆ నిరీక్షణ తెరదించేలా కనిపించినా ఫైనల్‌లో నిరాశ తప్పలేదు. 2019, 2024ల‌లో సాత్విక్ జోడీ ఇదే టోర్నీలో విజేతగా నిలిచింది.

Next Story