టీజీ20 లీగ్ ప్రైజ్ మనీ ఫిక్స్.. విజేత, రన్నరప్‌ జట్లు గెలుచుకునేది ఎంతంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-16 12:05:26  IST  )

హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకం నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రైజ్ మనీ ఖరారైంది.

టీజీ20 లీగ్ ప్రైజ్ మనీ ఫిక్స్.. విజేత, రన్నరప్‌ జట్లు గెలుచుకునేది ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీజీ20 (TG20) లీగ్’ ఫస్ట్ సీజన్‌కు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. లీగ్‌లో గెలిచే జట్లకు అందించే నగదు బహుమతుల (Prize Money) వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ మెగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచే జట్టుకు రూ.1 కోటి భారీ నగదు బహుమతి లభించనుంది. అలాగే, రన్నరప్‌గా నిలిచిన రన్నరప్ జట్టుకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ అందించనున్నారు. TG20 లీగ్ ప్రారంభానికి ముందే సిటీలో సందడి మొదలుకానుంది. టోర్నమెంట్‌లో విజేతకు అందించే మెరిసే విన్నర్స్ ట్రోఫీని రేపు ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు హెచ్‌సీఏ ప్రతినిధులతో పాటు క్రీడా, సినీ రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఈ లీగ్‌లో మొత్తం 38 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉండనున్నాయని. జూలై 12న టీజీ20 లీగ్ ఫైనల్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది.



Next Story