Ind vs Pak : సూర్య వర్సెస్ సల్మాన్.. మ్యాచ్‌కు ముందే హీట్ పెంచిన కెప్టెన్లు

by Harish |

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌‌కు ఉండే క్రేజే వేరు. అంతకుమించి‌ ఈ మ్యాచ్ ఇరు దేశాల అభిమానుల భావోద్వేగానికి సంబంధించింది.

Ind vs Pak : సూర్య వర్సెస్ సల్మాన్.. మ్యాచ్‌కు ముందే హీట్ పెంచిన కెప్టెన్లు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌‌కు ఉండే క్రేజే వేరు. అంతకుమించి‌ ఈ మ్యాచ్ ఇరు దేశాల అభిమానుల భావోద్వేగానికి సంబంధించింది. మైదానంలో కూడా ఇరు జట్ల ప్లేయర్లు అంతే దూకుడుగానే కనిపిస్తారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, పాక్ జట్లు తొలిసారిగా ఆసియా కప్‌లో ఎదురుపడబోతున్నాయి. ఈ నెల 14న జరిగే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ మాములుగా ఉండదని ఇరు జట్ల కెప్టెన్లు హింట్ ఇచ్చారు. బుధవారం కెప్టెన్ల ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణంగా ఒక్కరికొకరు హగ్, షేక్ హ్యాండ్ ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటారు.

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇతర జట్ల సారథులకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కానీ, పాకిస్తాన్ కెప్టెన్ అఘా సల్మాన్‌కు మాత్రం హగ్ గానీ, షేక్ హ్యాండ్‌గానీ ఇవ్వలేదు. సల్మాన్ కూడా ఆసక్తి చూపించలేదు. అంతటితో వార్ ముగిసిపోలేదు. మైదానంలో దూకుడుగా ఆడతామంటూ మాట్లాడారు. తమ ప్లేయర్లను ఆపబోమంటూ మ్యాచ్‌పై అంచనాలు పెంచేశారు. ‘మైదానంలో కచ్చితంగా దూకుడుగా ఉంటాం. దూకుడు లేకుండా ఆడలేం’అని సూర్య తెలిపాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు. మైదానంలో ఉన్నపుడు తాను తన ప్లేయర్ల దూకుడును ఆడ్డుకోనని చెప్పాడు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉండనుంది. కానీ, ఫామ్ పరంగానైనా, ఆటగాళ్ల దృష్ట్యా అయినా పాక్‌పై టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఓడితే మాత్రం తీవ్ర విమర్శలు తప్పవు.


Next Story