ఆసిస్ జట్టుపై సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా సంచలన ఆరోపణలు

by Harish |

క్రికెట్‌లో చోకర్స్‌గా తమపై ఉన్న ముద్రను సౌతాఫ్రికా ఎట్టకేలకు చెరిపేసుకుంది.

ఆసిస్ జట్టుపై సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా సంచలన ఆరోపణలు
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెట్‌లో చోకర్స్‌గా తమపై ఉన్న ముద్రను సౌతాఫ్రికా ఎట్టకేలకు చెరిపేసుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడమే కాకుండా 27 ఏళ్ల ఐసీసీ టైటిల్‌ నిరీక్షణకు తెరదించింది. అయితే, ఆసిస్ జట్టుపై సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సంచలన ఆరోపణలు చేశాడు. తమ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆసిస్ ప్లేయర్లు నోటి పనిచెప్పినట్టు చెప్పాడు. తమపై స్లెడ్జింగ్‌‌కు దిగినట్టు ఆరోపించాడు. ‘మార్‌క్రమ్, నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆసిస్ ఆటగాళ్లు భయంకరమైన పదాన్ని వాడారు. చోకర్స్ అని పిలిచారు. మేము ఎంతో నమ్మకంతో ఆడాం. అలాగే, చాలా సందేహాలు కూడా ఉన్నాయి. కానీ, ఈ విజయం వాటిని తుంగలో తొక్కింది. ఈ విజయం మా దేశానికి స్ఫూర్తినిస్తుంది.’ అని బవుమా చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత సౌతాఫ్రికా ఓటమి ఖాయమనుకున్న తరుణంలో ఆ జట్టు పుంజుకున్న తీరు అద్భుతమే అని చెప్పాలి. మార్‌క్రమ్(136) శతకానికితోడు బవుమా(66) రాణించి సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించారు.


Next Story