- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భరత్ భళా.. ఫైనల్‌కు అడుగు దూరంలో తెలుగు టైటాన్స్
పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచులో 23 పాయింట్లతో భరత్ చెలరేగాడు. ఈ విజయంతో తెలుగు టైటాన్స్.. ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్‌కు అడుగు దూరంలో నిలిచింది.

దిశ, స్పోర్ట్స్: పట్నా పైరేట్స్ విజయయాత్రకు తెలుగు టైటాన్స్ బ్రేకులు వేసింది. త్యాగరాజ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-12 ఎలిమినేటర్-3లో చెలరేగి ఆడిన తెలుగు టైటాన్స్.. వరుసగా 8 విజయాలతో జోరుమీదున్న పట్నా పైరేట్స్‌పై 46-39 పాయింట్ల తేడాతో జయభేరి మోగించింది. మంగళవారం జరిగిన మ్యాచులో భరత్ హుడా 23 పాయింట్లతో చెలరేగాడు. మిగతా వాళ్లు కూడా ఫర్వాలేదనిపించారు. దీంతో పట్నాపై తెలుగు టైటాన్స్ ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో రెండో క్వాలిఫైయర్‌కు అర్హత సాధించిన ఈ టీం.. బుధవారం నాడు పుణెరి పల్టన్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్ కూడా నెగ్గితే ఫైనల్ చేరుతుంది. క్వాలిఫైయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‌లో దబాంగ్ ఢిల్లీని ఢీకొంటుంది.
అయాన్ అదుర్స్..
అదే సమయంలో పట్నా టీంలో అయాన్ కూడా 22 పాయింట్లతో రెచ్చిపోయాడు. ఈ సీజన్‌లో 20+ పాయింట్లు సాధించడం అయాన్‌కు ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఈ ఘతన సాధించిన తొలి పీకేఎల్ రైడర్‌గా అతను రికార్డు సృష్టించాడు. ఈ సీజన్‌ను 316 పాయింట్లతో ముగించాడీ యంగ్ స్టార్. ఇలా ఒక సీజన్‌లో 300పైగా పాయింట్లు సాధించిన ఐదో ప్లేయర్‌గా అతను నిలిచాడు. కానీ అతనికి మిగతా ప్లేయర్ల నుంచి పెద్దగా సహకారం అందలేదు.






