Asian Games 2023 : ఆర్చరీలో తెలుగమ్మాయి జ్యోతి టీమ్‌కు మరో గోల్డ్

by Kema Shiva Kumar |   (  Updated:2023-10-05 11:17:51  IST  )

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇవాళ కూడా భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది.

Asian Games 2023 : ఆర్చరీలో తెలుగమ్మాయి జ్యోతి టీమ్‌కు మరో గోల్డ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇవాళ కూడా భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. ఆర్చరీలో మరో గోల్డ్ మెడల్ భారత్ వశమైంది. మహిళా కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం గోల్డ్ గెలుచుకున్నారు. నిన్న ఆర్చరీ మిక్స్‌డ్‌లో తెలుగమ్మాయి జ్యోతి, ప్రవీణ్ ఒజాస్ ద్వయం స్వర్ణం గెలిచింది. ఇప్పటి వరకు భారత్‌కు మొత్తం పతకాల సంఖ్య 82కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలున్నాయి.

Next Story