- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణకు అగ్రస్థానం.. విజేతలను అభినందించిన హోంమంత్రి
by GSrikanth |
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన 6వ జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్‌లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. విజేతలను మంత్రి కార్యాలయంలో బుధవారం అభినందించారు. ఈ డ్యూటీ మీట్‌లో మొత్తం 19 రాష్ట్రాలు, 960 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ మీట్‌లో 68 మంది తెలంగాణ జైళ్ల శాఖ ఉద్యోగులు వివిధ క్రీడాంశాలల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబరచారని మంత్రి అన్నారు. 6 బంగారు, ఒక వెండి, 2 రజతంతో పాటు 4 ట్రోఫీలు సాధించారన్నారు. పతకాలు సాధించి తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. డ్యూటీ మీట్‌లో బృందానికి వరంగల్ కేంద్రకారాగారా పర్యవేక్షాణాధికారి సంపత్ సారథ్యం వహించారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ జితేందర్, ఐజీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






