హైజంప్‌లో శంకర్‌కు గోల్డ్ మెడల్.. ఒలింపిక్ మెడలిస్టును ఓడించిన ఇండియన్!

by Phanindra |

ఒలింపిక్ మెడలిస్టుకు షాకిచ్చిన శంకర్. గోల్డ్ మెడల్‌తో మెరిసిన భారతీయ హైజంపర్.

హైజంప్‌లో శంకర్‌కు గోల్డ్ మెడల్.. ఒలింపిక్ మెడలిస్టును ఓడించిన ఇండియన్!
X

దిశ, స్పోర్ట్స్: ఒలింపిక్ మెడలిస్టుకు భారత హైజంపర్ తేజస్విన్ శంకర్ షాకిచ్చాడు. ఒలింపిక్స్‌తోపాటు వరల్డ్ ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్స్ నెగ్గిన షెల్బీ మెక్‌ఈవెన్‌ను డిలాస్ డాడ్స్ ఇన్విటేషనల్ 2026 టోర్నీలో శంకర్ ఓడించాడు. కన్సాస్‌లోని మాన్‌హాటన్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో 27 ఏళ్ల శంకర్ 2.26 మీటర్లతో గోల్డ్ మెడల్ కొట్టాడు. షెల్బీ 2.22 మీటర్లతో రెండో స్థానానికే పరిమితమయ్యాడు. మరో అమెరికన్ డెవిన్ లూడర్‌మిల్క్ కూడా 2.22 మీటర్లతో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

గత మూడేళ్లలో శంకర్ బెస్ట్ జంప్ కూడా ఇదే కావడం గమనార్హం. 2023 ఇండోర్ గ్రాండ్ ప్రిక్స్‌లో కూడా శంకర్ 2.26 మీటర్ల జంప్‌తో ఆకట్టుకున్నాడు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన శంకర్.. తొలి ప్రయత్నంలో 2.05 మీటర్లు జంప్ చేశాడు. ఆ తర్వాత వరుసగా 2.10 మీ, 2.14 మీ, 2.18 మీ, 2.22 మీటర్ల జంప్స్ చేశాడు. చివరి ప్రయత్నంలో 2.26 మీటర్ల జంప్‌తో అగ్రస్థానం సాధించాడు. కాగా, 2018లో 2.29 మీటర్ల జంప్‌తో శంకర్ జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత పలుమార్లు 2.30 మీటర్లు జంప్ కోసం ప్రయత్నించినా విఫలమయ్యాడు.

Next Story