IND VS PAK: పాకిస్థాన్ పై టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

by velandi.Saikiran |   (  Updated:2025-09-14 17:57:45  IST  )

టీమిండియా... పాకిస్థాన్ పై విజ‌యం సాధించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింద

IND VS PAK: పాకిస్థాన్ పై టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ
X

దిశ‌, వెబ్ డెస్క్ : అంద‌రూ ఊహించిందే జ‌రిగింది.. అంద‌రూ అనుకున్న‌ది దుబాయ్ లో చోటు చేసుకుంది. పాకిస్థాన్ జ‌ట్టును దారుణంగా సూర్య‌కుమార్ సేన ఓడించింది. బ్యాటింగ్‌, బౌలింగ్ ఇలా రెండు విభాగాల్లోనూ అత్యంత ప్ర‌మాదంగా ఆడిన టీమిండియా... పాకిస్థాన్ పై విజ‌యం సాధించింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది టీమిండియా. కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ చివ‌రి వ‌ర‌కు నిల‌బ‌డి.. జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. 15.5 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది టీమిండియా. దీంతో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ అందుకుంది. ఈ విజ‌యంతో సూప‌ర్ 4 కు మార్గం సుగ‌మం చేసుకుంది సూర్య టీం.

దుమ్ములేపిన సూర్య, అభిషేక్‌

దుబాయ్ మ్యాచ్ లో.... టీమిండియా చేజింగ్ చేసే క్రమంలో అభిషేక్ శర్మ దుమ్ము లేపాడు. మొదటి నుంచి దాటిగా ఆడాడు. 238 స్ట్రైక్ రేట్ తో... పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే 31 పరుగుల వద్ద అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. అటు గిల్ కేవలం పది పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 47 పరుగులతో తన సత్తా చాటాడు. చివర్లో సిక్సర్ కొట్టి మ్యాచ్ లు గెలిపించాడు. అటు బౌలర్లలో... కుల్దీప్ యాదవ్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి మరోసారి... తన సత్తా చాటాడు. బుమ్రా, అక్సర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా అలాగే వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టి... పాకిస్తాన్ నడ్డి విరిచారు.

Next Story