- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICC ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా.. అగ్రస్థానంలో అభిషేక్, వరుణ్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ప్లేయర్లు అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి వరుసగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నంబర్ వన్ స్థానాలను కైవసం చేసుకున్నారు

దిశ, వెబ్‌డెస్క్: భారత టీ20 స్పెషలిస్ట్ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఐసీసీ ర్యాంకింగ్స్ మరోసారి తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇవాళ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. బ్యాటింగ్, బౌలింగ్.. ఇలా రెండు ప్రధాన విభాగాల్లోనూ మన కుర్రాళ్లే అగ్రస్థానంలో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
నెంబర్‌వన్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ..
పవర్ హిట్టర్ అభిషేక్ శర్మ టీ20 బ్యాటింగ్ విభాగంలో తన నంబర్‌వన్ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. గత కొన్ని సిరీస్‌లుగా నిలకడగా రాణిస్తూ, మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న అభిషేక్.. ప్రపంచ మేటి బ్యాటర్లను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే, పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద ఫర్హాన్ (Sahibzada Farhan) అద్భుత ఫామ్‌లో ఉండటంతో, అతడు అభిషేక్ శర్మ రేటింగ్ పాయింట్లకి చేరువగా వస్తున్నాడు. వీరిద్దరి మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటంతో తర్వాతి సిరీస్‌లు ఆసక్తికరంగా మారనున్నాయి.
బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి టాప్..
మరోవైపు బౌలింగ్‌లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అతడు టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాటు వికెట్లు తీయడంలో వరుణ్ చూపుతున్న ప్రతిభ అతడిని నంబర్‌వన్ స్థానానికి చేర్చింది.






