- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యూజిలాండ్ కు షాక్...తొలి వన్డేలో భారత్ విక్టరీ
న్యూజిలాండ్ పైన మొదటి వన్డేలో ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది గిల్ టీమ్.

దిశ, వెబ్ డెస్క్: కొత్త సంవత్సరంలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది భారత జట్టు. న్యూజిలాండ్ పైన మొదటి వన్డేలో ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది గిల్ టీమ్. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లు ఆడి 300 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా జాగ్రత్తగా ఆడిన భారత జట్టు, చివరి ఓవర్ లో మ్యాచ్ గెలిచింది.
300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ 93 పరుగులు చేయగా, కెప్టెన్ గిల్ 56 పరుగులతో దుమ్ము లేపాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ 49 పరుగులతో కం బ్యాక్ ఇచ్చాడు. ఇక చివరలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, హర్షిత్ అదరగొట్టారు. హర్షిత్ ఔట్ అయినప్పటికీ చివరి వరకు బ్యాటింగ్ చేసిన రాహుల్ 29 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో 3 వన్డేల సిరీస్ లో 1-0 తేడాతో లీడింగ్ లోకి వచ్చింది భారత జట్టు. ఇక రెండవ వన్డే జనవరి 14, మూడవ వన్డే జనవరి 18వ తేదీన జరగనుంది.






