- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డేంజర్ లో టీమిండియా...పాయింట్ల పట్టికలో మరింత కిందకు !
మిండియా, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. నిన్న దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో టీమిండియా కిందికి

దిశ, వెబ్ డెస్క్ : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఆశించిన తీరులో టీమిండియా మహిళల జట్టు ఆడడం లేదు. మొదట పాకిస్తాన్, శ్రీలంక జట్లపై విజయం సాధించిన టీమిండియా, ఆ తర్వాత వరుసగా రెండు ఓటములు చవిచూసింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రెండు జట్లపైన దారుణంగా ఓడిపోయింది. ఈ రెండు మ్యాచ్ లు గెలవాల్సినవి. కానీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల టీమిండియా ఓడిపోయిందని అంటున్నారు. ఈ దెబ్బకు పాయింట్ల పట్టికలో కూడా టీమిండియా మరింత కిందికి వచ్చింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడిన టీమిండియా, రెండిటిలో గెలిచి, మరో రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది.
దీంతో నాలుగు పాయింట్లు సాధించిన టీమిండియా, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. నిన్న దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో టీమిండియా కిందికి రావాల్సి వచ్చింది. ఇక ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ ఉంది. ఇందులో ఎక్కువ శాతం న్యూజిలాండ్ విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే టీమిండియా మరింత కిందికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఇకనైనా టీమిండియా పుంజుకొని ఆడాల్సిందేనని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. లేకపోతే టీమిండియా ఇంటి దారి పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు టీమ్ ఇండియా తన తర్వాతి మ్యాచ్ లలో ఇంగ్లండ్ లాంటి బలమైన జట్లను ఢీ కొట్టాల్సి ఉంటుంది.






