- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్ల బ్యాండ్లతో సెమీస్ ఆడిన టీమ్ ఇండియా
1965 నుంచి 1977 మధ్య ముంబై జట్టు తొమ్మిది రంజీ ట్రోఫీ టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో ముంబై జట్టులో శివాల్కర్ సభ్యుడిగా ఉన్నాడు.

- ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో చేతులకు బ్లాక్ బ్యాండ్స్
- పద్మాకర్ శివాల్కర్‌కు నివాళి
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ చేతులకు నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ క్రికెటర్ పద్మాకర్ శివాల్కర్ (84) ముంబైలో మరణించారు. ఆయన గౌరవార్థం భారత క్రికెటర్లు ఆర్మ్ బ్యాండ్స్ ధరించి ఆస్ట్రేలియాతో సెమీస్ ఆడింది. మాజీ క్రికెటర్ అయిన పద్మాకర్ శివాల్కర్ రంజీ ట్రోఫీలో అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఆధిపత్యంలో శివాల్కర్‌ది కీలక పాత్ర. 1965 నుంచి 1977 మధ్య ముంబై జట్టు తొమ్మిది రంజీ ట్రోఫీ టైటిల్స్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో ముంబై జట్టులో శివాల్కర్ సభ్యుడిగా ఉన్నాడు. రెండు దశాబ్దాల పాటు అద్భుతమైన క్రికెట్ కెరీర్ కలిగి ఉన్న శివాల్కర్.. మొత్తం 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయిన శివాల్కర్ తన కెరీర్‌లో 19.69 సగటుతో 589 వికెట్లు పడగొట్టాడు. 1972-73 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడుపై 8/16, 5/18లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. శివాల్కర్ మృతి దురదృష్ణకరమని బీసీసీఐ నివాళులు అర్పించింది.






