సింగపూర్ చేతిలో ఓటమి.. ఆసియా కప్ రేసు నుంచి భారత్ అవుట్

by Phanindra |

సింగపూర్ చేతిలో ఓటమి పాలైన భారత ఫుట్‌బాల్ జట్టు.. ఆసియా కప్ క్వాలిఫైయర్స్ రేసు నుంచి తప్పుకుంది.

సింగపూర్ చేతిలో ఓటమి.. ఆసియా కప్ రేసు నుంచి భారత్ అవుట్
X

దిశ, స్పోర్ట్స్: ఏఎఫ్‌సీ ఆసియా కప్ 2027 క్వాలిఫైయర్స్‌లో భారత ఫుట్‌బాల్ టీం ఓటమి చవిచూసింది. సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-2 తేడాతో భారత్ ఓడింది. ఆట మొదలైన తర్వాత లిలియాంజులా చాంగ్‌టే అద్భుతమైన గోల్‌తో 1-1తో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ దాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. సింగపూర్ స్టార్ ప్లేయర్ సాంగ్ యూ యంగ్ అద్భుతమైన గోల్‌తో 1-1 స్కోరుతో తొలి హాఫ్ ముగిసింది. సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే మరోసారి సూపర్ గోల్ చేసిన సాంగ్.. సింగపూర్‌ను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ స్కోరును సమం చేసేందుకు టీమిండియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ చివరకు మ్యాచ్‌ను ఓటమితో ముగించింది. దీంతో ఆసియా కప్ క్వాలిఫైయర్ రేసు నుంచి కూడా భారత్ నిష్క్రమించింది.

Next Story