- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిటైర్మెంట్ ప్రకటించడానికి మెయిన్ రీజన్ అదే.. విరాట్ కోహ్లీ క్లారిటీ
రిటైర్మెంట్‌పై టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రిటైర్మెంట్‌పై టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్‌కు ఎందుకు రిటైర్మెంట్(Retirement) ప్రకటించాల్సి వచ్చిందో క్లియర్‌గా చెప్పారు. కొత్త ప్లేయర్లకు అవకాశం ఇచ్చేందుకే తాను తప్పుకున్నానని అన్నారు. కొత్త వాళ్లు రావాలి.. వారు జట్టులో సెట్ అవ్వాలని భావించినట్లు చెప్పారు. అంతేకాదు.. జట్టులో కొత్తగా చేరిన వాళ్లు ఇప్పటినుంచి గట్టిగా ప్రయత్నిస్తేనే వచ్చే ప్రపంచకప్ వరకు స్ట్రాంగ్‌గా అవుతారని సూచించారు. అందుకే తాను రిటైర్మెంట్ ప్రకటించానని అన్నారు. కాగా, ఇండియా తరపున విరాట్ కోహ్లీ 125 టీ20 మ్యాచులు ఆడారు. 4188 పరుగులు చేశారు. ఈ ఫార్మాట్‌లో ఒక సెంచరీ చేయగా, 38 హాఫ్ సెంచరీలు చేశారు. విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్‌లో విజయం అనంతరం ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు.






