- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తిరిగొస్తా.. తిరిగిస్తా’.. రిషబ్ పంత్ ప్రకటన
మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టులో భారత(India) స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు గాయమైన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు.

దిశ, వెబ్‌డెస్క్: మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టులో భారత(India) స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు గాయమైన విషయం తెలిసిందే. దీంతో మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ఇంగ్లాండ్(England)తో జరిగిన మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్(Rishabh Pant) గాయంతోనే క్రీజ్‌లోకి వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అవసరమైతే పంత్ బ్యాటింగ్‌కు వస్తాడని బీసీసీఐ ముందే చెప్పింది. కానీ, ఆ అవసరం రాకుండానే భారత బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. గాయం కారణంగా రిషభ్ పంత్ ఐదో టెస్టుకు దూరమైన క్రమంలో భారతజట్టుకు తన సందేశం ఇచ్చాడు. నా జీవితంలో గొప్ప క్షణం ఏదైనా ఉంది అంటే.. అది దేశం కోసం ఆడే సమయమే. గాయం తగ్గగానే మెల్లగా ప్రాక్టీస్ మొదలు పెడతా.. మళ్లీ వందశాతం తిరిగొస్తా.. వందశాతం తిరిగి ఇస్తానని రిషబ్ పంత్ ప్రకటించారు. ఆరోజు కోసం ఎదురుచూస్తాను అని పేర్కొన్నారు. ఇదే క్రమంలోనే చివరి టెస్టు గెలిచేందుకు ప్రయత్ని్ద్దామని జట్టు సభ్యులకు సూచించారు.






